26-11-2025 12:16:33 AM
కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లతండాలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం
ఇల్లందు, నవంబర్ 25, (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛని సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాల ని ఇల్లందు డిఎస్పి చంద్రభాను కోరారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఇండ్లతండాలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు.
ఇందులో భాగంగా గ్రా మంలోని ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాల పత్రాలను పరిశీలించి సరిగ్గా పత్రాలు ఉన్న వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించారు. అనంతరం గ్రామస్తులతో స మావేశాన్ని ఏర్పాటు చేసి ఇల్లందు డిఎస్పి చంద్రభాను పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో యే పంచాయితీ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ పోలీ సు వారికి ప్రజలు సహకరించాలని కోరారు.
చట్టవ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మట్కా, జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమై నదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పా ల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియ జేసారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో గుండాల సిఐ రవీందర్,ఇల్లందు సీఐ సురేష్,టేకులపల్లి సీఐ స త్యనారాయణ,ఎస్త్స్రలు రవూఫ్,నాగుల్ మీ రా, సోమేశ్వర్ రాజేందర్,శ్రీనివాసరెడ్డి లతో పాటు సుమారుగా 100 మందికి పైగా పోలీ స్ సిబ్బంది పాల్గొన్నారు.