calender_icon.png 25 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

25-12-2025 12:37:08 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, డిసెంబర్ 24 ( విజయక్రాంతి )  : పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండి పోయిన బ్యాంకు డిపాజిట్ల డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బిఐ కల్పించిన అవకాశాన్ని ప్రజలందరికి తెలియజేసి సద్వినియోగ పరుచుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మీ డబ్బు మీ హక్కు శిబిరాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ కార్యక్రమానికి ఆర్బిఐ ఏజీఎం లక్ష్మి శ్రావ్యతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండి పోయిన బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ తదితర డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బిఐ ఖాతాదారులకు అవకాశం కల్పించిందని చెప్పారు.

ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఆశీష్ రంజన్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ కృష్ణమూర్తి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సి శ్రీనివాస్, డిసిసిబి చీఫ్ మేనేజర్ భూపాల్ రెడ్డి, వనపర్తి లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.