calender_icon.png 25 December, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమానత్వం కోసమే కమిషన్

25-12-2025 12:36:50 AM

కమిషన్ చైర్మన్ వెంకటయ్య 

జహీరాబాద్, డిసెంబర్ 24 : సామాజిక సమానత్వం కోసమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య అన్నారు. ఇటీవల కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. బుధవారం నాడు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాటు సభ్యులు రాంబాబు గ్రామాన్ని సందర్శించి సమగ్రమైన విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి షెడ్డు కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంఘటన పూర్తిగా అగ్రవర్ణాల దాడిగానే భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బాధితులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆరుగురిపై కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈనెల 30న గ్రామంలో సివిల్ రైట్ డే ను నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సమానత్వం న్యాయ పరిరక్షణ పై ప్రజల్లో చైతన్యం పెరగాలని తెలిపారు. కోహిర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆయన అకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్కు ప్రహరీ గోడ లేనందున నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.