30-08-2025 02:10:03 AM
- మార్కెట్లలో విస్తృత తనిఖీలు
- వినియోగదారులకు నాణ్యమైనవి అందించాలని సూచన
హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలోని కూరగాయ లు, పండ్ల మార్కెట్లలో జీహెఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారం రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా శుక్రవారం ఈ తనిఖీలు నిర్వహించారు. 455 మంది కూరగాయలు, పం డ్ల వ్యాపారులకు కూరగాయలు, పండ్ల గ్రేడిం గ్, వ్యర్థాలను సరైన రీతిలో పారవేయ డం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా స్టోరేజీ చేసే విధానంతో పాటు వినియోగదారులకు మంచి కూరగాయలు, పండ్లను అందించాలని అధికారులకు సూ చించారు. మొదటి రోజు కుషాయి గూడ కూరగాయల మార్కెట్, సరూర్‌నగర్ రైతు బజార్, వనస్థలిపురం కూరగాయలు, పండ్ల మార్కెట్, మదన్నపేట మండి, మీర్ ఆలం మండి, ఒవైసీ కూరగాయల మార్కెట్, మొజమ్‌జాహి మార్కెట్, మొండా మార్కెట్, సనత్‌నగర్ కూరగాయల మార్కెట్, ఖైరతాబాద్ కూరగాయల మార్కెట్, మెహదీప ట్నం రైతు బజార్, లింగంపల్లి మార్కెట్, పటాన్‌చెరువు వ్యవసాయ మార్కె ట్, జేఎన్ టీయూ రైతు బజార్, షాపూర్ నగర్ పండ్ల మార్కెట్, బొ ల్లారం మార్కెట్, మల్కాజ్‌గిరి పండ్ల బజా ర్, మెట్టుగూడ కూరగాయల మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పించారు