calender_icon.png 27 July, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి

28-06-2025 12:36:15 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూన్ 27 (విజయ క్రాంతి), ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో  తెలంగాణ డీజీపీ  అభినందనలు తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర  చేతుల మీదుగా ప్రశంసా పత్రం ను అదనపు ఎస్పి నరసింహారెడ్డికి అందజేశారు. 

 సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో కామారెడ్డి జిల్లా దరఖాస్తులు అందిన వెంటనే విచారణ చేసి రిపోర్ట్ లు పంపడం జరిగింద అన్నారు. డీజీపీ  కార్యాలయము నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన జిల్లా నుండి ఒక్కటి కూడా దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా జిల్లా పోలీస్ శాఖకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. 

ఈ సందర్భంగా  డీజీపీ డాక్టర్ జితేందర్,  జిల్లా నోడల్ అధికారి అదనపు  ఎస్పీ  కే. నరసింహారెడ్డి కి ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.  ప్రజావాణి పిటిషన్లను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పోలీస్ శాఖ తన నీబద్ధతను మరోసారి నిరూపించింద న్నారు.

ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,  నరసింహారెడ్డి నీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, నిష్పాక్షికంగా పరిష్కరించడం ద్వారా పోలీస్ విభాగంపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరచడమే మా లక్ష్యం. ఈ విజయానికి కృషి చేసిన అన్ని స్థాయి పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పి   అభినందనలు తెలిపారు.