13-08-2025 12:00:00 AM
సీపీఎం
ఎర్రుపాలెం ,ఆగస్టు 12 ( విజయ క్రాంతి): కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్యల వీర య్య, సిపిఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు ఎర్రుపాలెం లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసి,వారు మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీలకు ప్రవేశపెట్టిన బిల్లు కేంద్ర బిజెపి ప్రభు త్వం అమలు కానీయ కుండా అడ్డుకుంటుందని విమర్శించారు.
బీసీల రిజర్వేషన్ బిల్లు కు, సామాజిక న్యాయానికి ,కులగణనకు కేం ద్ర ప్రభుత్వం వ్యతిరేకమని వారు విమర్శించారు బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నిక ల్లో తమ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందు కు. ముస్లింలను షాక్ గా చూపిస్తుందని అ న్నారు. బీసీల రిజర్వేషన్ బిల్లులో హిందువులు కూడా ఉన్నారని వారు బిజెపికి వ్యతి రేకమా అని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొల్లపూడి కోటేశ్వరరావు ,నల్లమోతు హనుమంతరావు,బసవయ్య ,నాగులవంచ వెంకట్రామయ్య సగ్గుర్తి సంజీవరావు, ,తదితరులు పాల్గొన్నారు.