14-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మదన్ మోహన్
రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, జులై 13 (విజయ క్రాంతి), ప్రజల శ్రేయస్సు, రైతు సంక్షేమమే తన ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని 6వ వార్డు, ఇందిరానగర్ కాలనీలో రేణుక ఎల్లమ్మ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి దేవి కృప ఎల్లారెడ్డి ప్రజలందరికీ ఉండాలని, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, నిలకడగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
రైతులకు మంచి పంటలు పండాలని,మార్కెట్లో సరైన ధర లభించాలని అమ్మవారి నీ వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, భక్తులు, భజన బృందాలు, డీజే బృందాలతో ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులతో కలిసి బోనం ఎత్తి, అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ప్రశాంత్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, వందలాది మంది కాలనీ వాసులు, మహిళలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జాతర నిర్వహించారు. పోలీస్ లు బందోబస్తు చేపట్టారు.