02-09-2025 12:27:57 AM
కోనరావుపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా లో కోనరావుపేట మండలం దేశం గర్వించదగ్గ, మేధావులను, సైంటిస్టులను, రాజకీయ నాయకులను, ప్రొఫెసర్లను అందించిన చారిత్రకమైన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ నుంచి 84 వ కాన్వకేషన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం,కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మాందాల సంయుక్త ఓయూలో గవర్నర్ జిష్ణు దేవ్, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ప్రొఫెసర్ అశోక్ చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందారు.
కోనరావుపేట నుంచి అత్యున్నతమైన పిహెచ్డి డాక్టరేట్ పొందడం, గ్రామానికి, నియోజకవర్గానికి, మండలానికి,ఎంతో మంది మహిళలకు గర్వకారణం,భవిష్యత్తులో మన ప్రాంతం నుండి, అమ్మాయిలు ఉన్నత విద్యను పొందడానికి, మార్గదర్శకంగా నిలిచారని భవిష్యత్తులో కోనరావుపేట గ్రామం నుండి దేశం గర్వించదగ్గ అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.