05-05-2025 01:55:44 AM
క్యాబినెట్ విస్తరణపై బహిరంగానే విమర్శలు
రచ్చకెక్కుతున్న కొత్త పాత నేతల మధ్య పేచీ
సమన్వయ సమావేశంలో ఎవరికి వారే యమునా తీరే
నేతల తీరుతో తలలు పట్టుకుంటున్న పార్టీ అధిష్టానం
రంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి): జిల్లా హస్తం పార్టీలో అసమ్మతి గళాలు గర్జిస్తున్నా యి. క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్క డం లేదంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి... పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర గడుస్తున్న నామినేటెడ్ పదవులు దక్కడం లేదంటూ మరికొందమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బహిరం గనే తమ అసంతృప్తిని వెళ్ల బుచ్చుతున్నారు.
మరోపక్క ఆయా నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలహీనపరుస్తున్నాయి. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకి అధిక ప్రయారిటీ ఇస్తున్నారని ఆది నుంచి కాంగ్రెస్ జెండా మోసిన తమకేది గుర్తింపు అంటూ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జి నేతలు తమ అసహనం వెలగక్కుతున్నారు.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మారి న ఎమ్మెల్యేలు ఇన్చార్జిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది. కాంగ్రెస్ పార్టీ అం టేనే ఆది నుంచి గ్రూపులకు కేరాఫ్ గా నిలుస్తుంద నే నానుడి ఉంది... కానీ స్థానిక సం స్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇ లా గ్రూపు తగాదాలు పార్టీని కొంప ముం చేలా ఉన్నాయంటూ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
పార్టీ అధిష్టానం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తుందే తప్ప కార్యకర్తలు పార్టీ నేతలను ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎక్కడ చేయడం లేదని విమర్శలు బహిరంగనే వినిపిస్తున్నాయి. స్థా నిక సంస్థలు ఎన్నికల ముందు అధిష్టానం పార్టీ నేతలను గాడిలో పెట్టకపోతే మొదటికే మోసం వస్తుందని పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే తమ కనిపిస్తుందని పలువురు కార్యకర్తలు బహిరంగగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
సమావేశంలో రసాభసా
పదేళ్ల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది.. కానీ మాకు ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉందని కాంగ్రెస్ నేత లు బహిరంగానే తమ అసంతృప్తిని వెళ్ళగకుతున్నారు. ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఉన్న విలువ ప్రస్తుతం పార్టీలో తమకు లేదంటూ మరికొంత మంది నేతలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న శంషాబాద్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
సమా వేశానికి పరిశీలకులుగా రాష్ట్ర స్పోరట్స్ చైర్మ న్ శివసేనారెడ్డి, ఏ ఐ సి సి నేత చల్లా వంశీ చంద్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలోని 8 నియో జకవర్గాలు మహేశ్వరం, షాద్నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, ఆమనగల్ బ్లాక్, రాజేంద్రనగర్ నియోజకవర్గం చెందిన మండల, బ్లాకు సీనియర్ కాంగ్రెస్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, చీఫ్ వీఫ్ పట్నం మహేందర్రెడ్డి ఇటీవల టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాం ధీ,చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య తో పా టు వారి అనుచర వర్గం సమావేశానికి హాజ రు కా కపోవడం తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.
సమావేశంలో ఆయా నియోజకవర్గాల చెందిన పార్టీ నేతలు కార్యకర్తలు, తమ అభిప్రాయాలను బహిరంగనే వెల్లడిం చి రచ్చ రచ్చ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి క్యాబినెట్లో కచ్చితంగా చోటు కల్పించాలని ఆయన మద్దతుదారులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ని నాదాలు చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం కు చెందిన ఇంచార్జి కేఎల్‌ఆర్ ఫోటో ను సమావేశంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పై ఫోటో ఎందుకు పెట్టారు అంటూ కొందరు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయా ని యోజకవర్గాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు పార్టీలో స్థానం దక్కడం లేదని పార్టీ కోసం కష్టపడిన వారికి ఇప్పటికి గుర్తింపు లేదంటూ ఫారాషూట్ నేతలకు పదవులు ద క్కుతున్నాయని పార్టీ నేతలు సమావేశంలో ఆగ్రహం వెల్లిబుచ్చారు.
ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ శాపనా ర్థాలకు సైతం దిగారు... ఒక దశలో పార్టీ నేత లు నినాదాలు చేస్తూ సమావేశంలో బహిష్కరించేందుకు ప్రయత్నాలు సైతం చేశారు. ఇది గమనించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఏఐసీసీ నేత వంశీ చందర్ రెడ్డిలు పార్టీ నేతలకు నచ్చజెప్పి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని ఆందోళనకు గురి కావద్దంటూ కార్యకర్తలు నచ్చజెప్పి ప్రయత్నం చేసి సమాచారం కొనసాగించడం గమనార్హం. ప్రధానంగా సమావేశంలో డిసిసి మండల బ్లాక్ అద్యక్షుల ఎంపిక నామినేటెడ్ పదవులపై సమావేశం కొనసాగింది.
అందరి దృష్టి డీసీసీ పీఠంపైనే
కాంగ్రెస్ పార్టీ వ్యవహారల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవలనే రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. సమావేశంలో ఆయా నేతల యొక్క అభిప్రాయాలను సేకరించారు. ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు, అధ్యక్ష పోస్టుల గురించి వారి అభిప్రాయాలను సేకరించారు. అయితే సమావేశంలో పలువురు నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాలను ఆమెకు వెల్లడించారు.
ఏళ్ల నుంచి పార్టీ కోసం శ్రమించిన వారికి పార్టీ సంస్థ గత పదవులు నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టాలని ఆమెకి సూచించారు. పార్టీ కోసం కష్టప డిన కార్యకర్తలు నేతలను గుర్తించి వారికి పదవులు కేటాయిస్తేనే క్షేత్రస్థాయిలో మరింతగా పార్టీ బలపడుతుందని... ప్రజల్లో కూ డా పార్టీపై విశ్వాసం పెరుగుతుందని ఆమెకు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్ల డించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగదాల గురించి సైతం ఆమెకు వివరించే ప్రయత్నం చేశారు.
తమ అనుకూల వర్గాలకే పదవులు దక్కేలా ఆయా నేతలు పావులు కదుపుతున్నారని వాటి కోసం శ్రమించిన వారిని ఎక్కడ గుర్తింపు ఇవ్వట్లేదు అని కూడా ఆమెకు సమావేశంలో చెప్పినట్లు సమాచారం.అయితే అందరినీ ఏక తాటి పైకి తీసుకువచ్చి పార్టీని ముందుకు నడిపించే నేతలకే జిల్లా డీసీసీ మండల బ్లాక్ అధ్యక్ష పదవులను కేటాయించాలని ఆమెకు ఆయా నేతలు విన్నవిం చారు.
డిసిసి పదవి కోసం చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి భీమ్ భరత్, మహేశ్వరం నియోజకవర్గ నేతలు దీప భాస్కర్ రెడ్డి, చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, ఇబ్రహీం పట్నం నియోజకవర్గం చెందిన కొత్త కురుమ శివకుమార్‌లు ప్రస్తుతం రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.