02-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఆగస్టు 1(విజయ క్రాంతి): వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో ఆరోగ్యవంతంగా ఉం డవచ్చని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను అదనపు కలెక్టర్ దీపక్ తివారి,డి ఆర్ డి ఓ దత్తారావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్ర త ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలని అప్పుడే గ్రామము పట్టణము పరిశుభ్రంగా ఉంటుందని తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించాలని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర, మల విసర్జన చేయడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, నాయకులు అన్ను పటేల్, భీమ్రావు, యాద వ రావు, లాల, సతీష్, అధికారులు పాల్గొన్నారు.