calender_icon.png 7 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేడియల్ రోడ్డు పనులను పూర్తి చేయాలి

07-11-2025 12:00:00 AM

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి శ్రీరాములు

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడం గ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో గురువారం కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణరెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్డు నెంబర్ 26 పనులను పూర్తిచేయాలని కోరుతూ మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు రంగా రెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి అందెల శ్రీరాములు హాజరై రోడ్డుపై బైఠాయించారు.

ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. రేడియల్ రోడ్ నెంబ ర్ 26 కంచన్‌బాగ్ నుంచి బాలాపూర్ చౌర స్తా, బడంగ్‌పేట్ మీదుగా నాదర్‌గుల్, ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్ వరకు 150 ఫీట్ల రోడ్డును 2009లో నాటి కాంగ్రెస్ హయాం లో జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మం జూరు చేశారని నాటి నుండి నేటి వరకు ఈ రోడ్డు పనులను ఎవరూ పూర్తి చేయలేదని మండిపడ్డారు.

పెరుగుతున్న జనాభా దృ ష్ట్యా ఈ రోడ్డు ఇరుకుగా మారిందన్నారు. అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక లకు ముందు తూతూ మంత్రంగా నాటి మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పనులను ప్రారంభించినట్టు నటించి ప్రజలను నమ్మిం చి ఓట్లను వేయించుకున్నార న్నారు. 2017 సంవత్సరంలో ఇదే రోడ్డు కొరకు సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేశారని మరి ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు పట్టించుకోవట్లేదన్నారు. రోడ్డు పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.