calender_icon.png 12 August, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ ప్రజావాణికి 150 అర్జీలు

12-08-2025 01:19:12 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): సోమవారం జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 అర్జీలు వచ్చాయి. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 60 అర్జీలు వచ్చా యి. ఫిర్యాదులు, వినతులను స్వీకరించిన జిహెచ్‌ఎంసి అధికారులు సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు అందజేశారు.

జీహెచ్‌ఎంసీ  హెడ్ ఆఫీస్‌లో నిర్వహించిన కార్యక్ర మంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆడిషన్ కమిషనర్లు మంగతాయారు, వేణుగోపాల్, పంకజ, గీత రాధిక సీసీ పీ.శ్రీనివాస్, అడిషనల్ సీ సీపీ గంగాధర్ ప్రదీప్, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్ పాల్గొన్నారు.