calender_icon.png 14 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడొద్దు

14-08-2025 12:57:50 AM

  1. డ్రగ్స్ పట్ల విద్యార్థుల అప్రమత్తంగా ఉండాలి 

జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం 

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (విజయక్రాంతి) విద్యార్థులు తాత్కాలిక ఆనందాలకు అలవాటు పడద్దని, ప్రభుత్వ విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సూచించారు. బుధవారం రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశముక్తి భారత్ అభియాన్, మిషన్ పరివర్తన లో భాగంగా ప్రతిజ్ఞ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేపించారు.

అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పుస్తకాలను చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. చదవడం వల్ల మాత్రమే ఉన్నత స్థాయిలో స్థిరపడతారని చెప్పారు. సమాజంలో డ్రగ్స్, ఆల్కహాల్ అత్యంత ప్రమాదాలకు దారితీస్తున్నాయని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. డ్రగ్స్ ని చాక్లెట్ల, సిగరెట్ల రూపంలో ఉచితంగా ఇచ్చి అలవాటు చేసే ప్రమాదం ఉందని అలాంటి వాటిని తిరస్కరించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

విద్యార్థుల అలవాట్లను గమనిస్తే వారు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారని చెప్పారు. ప్రతి పాఠశాలలో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రహరీ కమిటీలు పనిచేయాలని పేర్కొన్నారు. ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు పాటించాలని ప్రతిజ్ఞ నేపథ్యాన్ని తల్లిదండ్రులకు, కుటుంబలకు, స్నేహితులకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారిక కేంద్రం కోఆర్డినేటర్ రోజా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి లత, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ మంద జనార్ధన్, కేసు వర్కర్ సుష్మా తదితరులు పాల్గొన్నారు.