14-08-2025 12:56:06 AM
బోయినపల్లి, ఆగస్టు 13:(విజయక్రాంతి): బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం కు బుధవారం 944 క్యూ సెక్ ల ఇన్ ఫ్లో వచ్చినట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ లో బుధవారం ఉదయం 3 మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు.
దీంతో 9450 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్న్ ల ద్వారా గోదావరి జలాలు ఎగిసిపడుతూ అక్కడి నుం చి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు నంది రిజర్వాయ ర్ నుంచి జంట సొరంగాల ద్వారా నీటి సరఫరా అవుతుంది. అక్కడినుంచి లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మూడు మోటర్లు ఆన్ చేసి అదే పరిమాణంలో మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి నీటి సరఫరా అవుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
కాగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వరి జలాశయం కు పం పోజ్ ద్వారా నీటి విడుదల ప్రక్రియ మొదటిసారిగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం సామర్థ్యం 27. 55 టీఎంసీల సామర్థ్యం గాను 7.60 టీఎంసీల నీటినిలువ ఉన్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. వరద కాలువ ద్వారా జలాశయం కు నీటి విడుదల కొనసాగుతుంది.