calender_icon.png 5 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీనిక్స్ నా కొడుక్కి మంచి ఆరంభం

05-11-2025 01:33:24 AM

‘ఫీనిక్స్’.. ఇప్పటికే తమిళంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాతో స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి కథానాయకుడిగా పరిచయమయ్యారు. దీనికి ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించగా, రాజ్యలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో నవంబర్ 7 రిలీజ్ కానుంది. ఈ సందర్భం మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈవెంట్‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “అనల్ అరసు మాస్టర్ నాకు ఈ కథ చెప్పి, మా అబ్బాయి నటించాలని అడిగారు. మీరిద్దరూ మాట్లాడుకోండని చెప్పాను. ఆ తర్వాత నాకేమీ తెలియదు. వాళ్లు సినిమా చేశారు. నేను చూశాను. చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నా. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే ఇష్టం.

అలాంటి సినిమాలు చేయడం తన కల. ఓ రోజు తను యాక్టర్ కావాలని చెప్పాడు. తర్వాతి ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్ట ర్, నిర్మాత రాజ్యలక్ష్మి వల్లే సాధ్యపడింది. ‘ఫినిక్స్’లో యాక్షన్, ఎమోషన్ అన్ని అద్భుతంగా కుదిరాయి” అని చెప్పారు. ‘తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంద’ని చిత్ర కథానాయకుడు సూర్య సేతుపతి అన్నారు.

డైరెక్టర్ అనల్ అరసు మాట్లాడుతూ.. “ఫీనిక్స్’ తమిళ్‌లో పెద్ద హిట్ అయింది. తెలు గులోనూ అంత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్‌కుమార్, చిత్ర నిర్మాత రాజ్యలక్ష్మి, రైటర్ భాష్యశ్రీ పాల్గొన్నారు.