05-11-2025 01:34:32 AM
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘జిగ్రీస్’. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను మౌంట్ మెరు పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. తాజాగా టీమ్ ఈ సినిమాలోని ‘మీరేలే..’ అనే పాటను డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో లాంచ్ చేయించింది. సయ్యద్ కమ్రాన్ స్వరపర్చిన ఈ పాటకు హరీశ్‌రెడ్డి ఉప్పుల లిరిక్స్ రాయగా, ఏక్‌నాథ్ ఆలపిం చారు. నవంబర్ 14న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఈశ్వరాదిత్య డీవోపీగా, కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, చాణక్యరెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.