calender_icon.png 19 November, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా

19-11-2025 12:00:00 AM

  1. ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో నిర్ణయం
  2. విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

ఈకేసులో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ప్రభాకర్‌రావు కీలకమైన ఆధారాలను ధ్వంసం చేశారని, అనేక డివైజ్‌లు, గ్యాడ్జెట్ల పాస్‌వర్డ్స్ చెప్పడం లేదని రాష్ట్రప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.   దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించింది.