08-11-2025 12:10:49 AM
పినపాక, నవంబర్ 7,(విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మం డలం బయ్యారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వర్గీయ దేవిరెడ్డి రోశి రెడ్డి -సుబ్బలక్ష్మమ్మ దంపతులు, కుమారుడు వీ రారెడ్డి గార్ల జ్ఞాపకార్థంగా ప్రజల సౌకర్యా ర్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాం తమైన ఈ బయ్యారం గ్రామంలో ఓపెన్ జిమ్మును ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉం దన్నారు.
జిమ్ములో ప్రతిరోజు యువత ప్రజలు ప్రాక్టీస్ చేయటంతో శరీర ధారుఢ్యాన్ని పెంపొందించుకొని ఆరోగ్య వంతులుగా ఎదగాలన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోడిశాల రావణాధం, పినపాక నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, మణుగూరు మండల అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింహాద్రి మనోజ్, మండల ముఖ్య నాయకులు, కరకగూడెం మండల అధ్యక్షులు ఎక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు