26-07-2025 12:54:21 AM
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి
హనుమకొండ టౌన్, జూలై 25 (విజయ క్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండలో శుక్రవారం డిజిటల్ ఎకానమీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్ ‘ అనే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐ సి ఎస్ ఎస్ ఆర్ ) హైదరాబాద్ సహకారంతో కళాశాల ఎకనామిక్స్ విభాగం నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి అధ్యక్షత వహి ంచారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి మాట్లడుతూ తెలంగాణాలోనే అత్యంత సమర్థవంతమైన మహిళా కళాశాలగా పింగళి కళాశాలకు గుర్తింపు పొందినదనీ, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో ఈ కళాశాల మౌలిక వసతుల కల్పనకు, హాస్టల్ సౌకర్యాన్ని మరింత పెంపొందించుటకు, మహిళా యూనివర్సిటీగా గుర్తించడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.
ఈ జాతీయ స్థాయి ఆర్దిక సదస్సు ఫలితాలు రాష్ట్ర ఆర్థిక సమస్యలను తీర్చే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన ప్రొఫెసర్ వి. సురేష్ లాల్, ప్రొఫెసర్ సిహెచ్. కృష్ణారెడ్డి, విశ్రాంత ప్రధాన ఆచార్యులు మీనయ్య, సెమినార్ కన్వీనర్ డాక్టర్ పి. పద్మజ లు మాట్లాడుతూ నేటి సమకాలిన పరిస్థితుల్లో కృత్రిమ మేధా నిత్యజీవితంలో భాగంగా మారింది. ప్రపంచ ఆర్థిక రంగంలో వస్తున్నారు పిడి కార్యక్రమంలో ద్రవ్య మార్పిడిగా డిజిటల్ ఎకనామిక రూపాంతరం చెందింది. గ్లోబల్ మార్కెట్లో డిజిటల్ ఎకనామిక్ ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ ఎం. అరుణ, డాక్టర్ సామిల్ ప్రవీణ్, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ రామకృష్ణారెడ్డి, పిడి సుజాత, మధు, సారంగపాణి, యుగంధర్, బాలరాజ్, లకన్ సింగ్, సువర్ణ, రాజేశ్వరి, శ్రీలత, ఉదయశ్రీ, ప్రశాంతి, రాజు రెడ్డి రాంరెడ్డి, రమేష్ కుమార్, మమత, సునీత, కవిత, అరుణ, సుమలత, రత్నమాల, లక్ష్మీకాంతం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.