26-07-2025 06:45:09 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
బూర్గంపాడు (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా ఉందన్నారు. గతంలో రేషన్ కార్డులో పేరు లేకపోవటంతో ప్రజలు చాలామంది ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. అనంతరం 29 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు,25 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్,ఎంపీడీవో జమలారెడ్డి,ఏపిఎం నాగార్జున,మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీపీ రోశిరెడ్డి,నాయకులు కైపు శ్రీనివాస్ రెడ్డి,బట్టా విజయ గాంధీ,భజన సతీష్ తదితరులు పాల్గొన్నారు.