calender_icon.png 27 July, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

26-07-2025 06:12:40 PM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..

గద్వాల (విజయక్రాంతి): జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణ పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టు (కుడి కాలువ)కు సంబంధించి భూసేకరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.

భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రైతులకు నోటీసులు అందజేయడం జరిగినందున, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద 99/బి, 100 ప్యాకేజీ కింద మంజూరైన చెక్కులను అందజేసేసి భూములను వెంటనే స్వాధీనం చేసుకొని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయలతో పనులను వేగవతంగా చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ డిఈ, ఏఈలు, గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్, ధరూర్ తహసిల్దార్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.