calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణాన్ని సందర్శించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి

19-09-2025 12:35:25 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి):  తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం ను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకులతో ఉన్నత విద్యా లక్ష్యాలు,నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించుకొనేలా విశ్వ విద్యాలయాలు చురుకైన పాత్ర పోషించాలని  సూచించారు. గ్రామీణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాలు నూతన సర్టిఫికెట్ కోర్సులను విద్యార్థులకు అందించాలని,

ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని , శాస్త్రవేత్తల సహకారంతో    స్కిల్ యూనివర్సిటీస్ కు దీటుగా అభివృద్ధి చెందాలని సూచించారు , సమాజంలో జరుగుతున్న సాంఘిక మార్పులను విద్యార్థులకు తెలియజేచేసి మార్పు తీసుకురావాలని, ఆన్లైన్ డిజిటల్ కామర్స్ లో ఉపయోగించి  గ్రామీణ ప్రాంతాలలో తయారైన వస్తువులను సైతం ప్రపంచానికి పరిచయం చేయొచ్చు అన్నారు,

విద్యతో పాటు  ఇంటర్షిప్ ప్రోగ్రామ్స్  విద్యార్థులకు అవగాహన కల్పించాలి అన్నారు, విశ్వవిద్యాలయాలు  పూర్వ విద్యార్థుల సహకారంతో  మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్  మాట్లాడుతూ ఆయన సూచనలను పాటించి మరింత ముందుకెళ్తామని, భవిష్యత్తులో విశ్వవిద్యాలయానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లు డా.యాలాద్రి,డా.సునీత, విమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి,apro డా.సరిత పిట్ల,అధ్యాపకులు డా.అంజయ్య,డా.మోహన్ బాబు,డా.హరిత,డా.ప్రతిజ్ఞ ,డా.నాగరాజు ,డా.నారాయణ,డా.నిరంజన్,శ్రీకాంత్,దిలీప్,డా.శ్రీమాత తదితరులు పాల్గొన్నారు.