calender_icon.png 8 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలను పెంచినట్లు మొక్కలను పెంచుకోవాలి

08-07-2025 01:47:34 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూలై 7 (విజయ క్రాంతి): మన ప్రాంతమంతా పచ్చదనంతో కాలుష్య రహితంగా మంచి వాతావరణంలో ఉండాలంటే మొక్కలు నాటాలని, మనం పిల్లలను పెంచుకునే విధంగా మొక్కలను పెంచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని ఎల్‌ఎండీ పరిసరాల్లోని సప్తగిరికాలనీ వాకింగ్ ట్రాక్ వద్ద వనహోత్సవంలో భాగంగా సోమవారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రా జేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. బర్త్ డేలు, పెళ్లి రోజులు, ప్రత్యేక రోజులలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను నాటి దానిని పెంచడం ఒక బాధ్యతగా పిల్లలను పెంచినట్లు పెంచాలన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో అక్కడ ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. మొక్కలు నాటడానికి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో, వార్డులో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు.

జిల్లాలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని, అందరూ సామాజిక బాధ్యతగా పాల్గొనాలన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు, మహిళా సంఘాలు మొక్కలు నాటాలని, మొక్కలు నాటేలా అధికారులు విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

- స్పోరట్స్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన మంత్రులు....

కరీంనగర్ లోని రీజనల్ స్పోరట్స్ స్కూల్లో 26 లక్షల రూ పాయలతో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ప్రారంభించారు. జిమ్నాస్టిక్ కోర్టును సందర్శించారు. సింథటిక్ ట్రాక్ వద్ద 10 లక్షల రూపాయలతో లైటింగ్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నదని, గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కరీంనగర్ రీజనల్ స్పోరట్స్ స్కూల్లో అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.

స్పోరట్స్ స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు, సైక్లింగ్ వెలోడ్రోమ్, హ్యాండ్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టులు, కబడ్డీ, ఖో-ఖో కోర్టులు ఏర్పాటు చేయాలని, పెవిలియన్ భవనం పునరుద్ధరణ చేయాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. 2036 ఒలంపిక్స్ లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించేలా ఇప్పటి నుంచే శ్రమించాలని విద్యార్థులకు సూచించారు.

యంగ్ ఇండియా స్పోరట్స్ స్కూల్స్ కూడా వస్తున్నాయన్నారు. కరీంనగర్ రీజనల్ స్పోరట్స్ స్కూ ల్ను ఇంటర్మీడియట్ వరకు పెంచాలని మంత్రి వాకిటి శ్రీవారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, తదితరులుపాల్గొన్నారు.