27-08-2025 01:51:45 AM
-14 గేట్ల ద్వారా నీటి విడుదల
-జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద
నాగార్జునసాగర్, ఆగస్టు 26 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక తగ్గడంతో 12గేట్లను మూసివేసి, 14 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం, సుంకేశుల నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
దీంతో సాగర్ గేట్లను 26 గేట్లలో 12 గేట్లు మూసి వేశారు. ఇన్ ఫ్లో 1,60,940 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,60,940 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 585.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 300.0315 టీఎంసీలుగా కొనసాగుతుంది.