04-09-2025 12:17:03 AM
* సిద్దిపేట డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేత
* కొండాపూర్ గ్రామస్తులు
ముస్తాబాద్, సెప్టెంబర్ 03( విజయ క్రాంతి): సిద్దిపేట నుండి ముస్తాబాద్, కొండాపూర్ మీదుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఆర్టిసి బస్సు వేయాలని సిద్దిపేట ఆర్టీసీ డిపో డిప్యూటీ మేనేజర్ కు కొండాపూర్ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా మార్వాడి గంగరాజు మాట్లాడుతూ సిద్దిపేట నుండి ముస్తాబాద్, కొండాపూర్ మీదుగా ఎల్లారెడ్డిపేట వరకు, ఎల్లారెడ్డిపేట నుండి కొండాపూర్,ముస్తాబాద్, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ కు నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించాలని డిపో మేనేజర్ ను కోరడం జరిగిందన్నారు.
ప్రతిరోజు కళాశాలలకు పాఠశాలలకు విద్యార్థులు,అలాగే గ్రామస్తులు తమ పనుల నిమిత్తం ముస్తాబాద్, సిద్దిపేట ప్రాం తాలకు వెళ్తారని పేర్కొన్నారు.ఆర్టీసీ బస్సులు లేక ఆటోలలో వెళ్లవలసి వస్తుందని,తద్వారా ఆర్థిక భారమవుతుందని తెలిపారు. గ్రామస్తులకు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని కోరుతూ ఆర్టిసి బస్సు వేయాలని డిపో మేనేజర్ ను కోరినట్లు తెలిపారు.
గతంలో అనగా 23 జూన్ 2025న డి ఎం కు 100 మంది సంతకాలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మార్వాడి గంగరాజు,తినేటి రామ్ రెడ్డి, పెద్దూరి శ్రావణ్ కుమార్, క్యారం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.