calender_icon.png 14 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాలను నిరోధించడంపై ప్రతిజ్ఞ

14-08-2025 01:07:55 AM

  1. డ్రగ్స్ రహిత సమాజం కృషి చేస్తాం

జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సదానందం

మణికొండ, ఆగస్టు 13 : రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం, ఏవోఎస్ అధికారులు హేమంత్, పద్మ, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తామూ భాగస్వామ్యులం అవుతామని ఉద్యోగులు చెప్పారు.

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తామంతా క్రియాశీల భాగస్వామ్యులము అవుతామని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, తమతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేస్తున్న వ్యక్తుల సమాచారం తమకు తెలిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తామని రవాణా శాఖ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.