18-11-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, నవంబర్ 17 : ఢాకా వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. అద్భుత ప్రదర్శన కనబరిచి 6 స్వర్ణా లతో సహా 10 పతకాలు సాధించారు. పురుషుల రికర్వ్ ఈవెంట్‌లో దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో దీప్షిక, జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకా ప్రదీప్ స్వర్ణం కైవసం చేసుకున్నారు.
వ్యక్తిగత విభాగాల్లో అంకత భకత్, జ్యోతి సురేఖ వెన్నం కూడా బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత ఆర్చరీ చరితరలో ఆసియా చాంపియన్‌షిప్‌కు సంబంధించి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా భారత ఆర్చ రీ క్రీడా కారులను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీచ్ చేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రశంసించారు.