18-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 17 : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ప్రారంభం కానుం ది. షెడ్యూల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాకున్నప్పటకీ ముంబై, బరోడా వేదికలుగా ఈ మెగా టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.లీగ్‌లో ఫస్టాఫ్ మ్యాచ్‌లకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడి యం ఆతిథ్యమివ్వనుంది. ఇటీవలే ఈ స్టేడియంలో వరల్డ్‌కప్ ఫైనల్ జరిగింది.
సెకం డాఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్స్‌ను బరోడాలోని కోటంబి స్టేడియంలో జరిపేందుకు బీసీసీఐ సన్నాలు చేస్తోంది. నవంబర్ 27న న్యూఢిల్లీ మహిళల ఐపీఎల్ వేలం జరగనుండగా అప్పుడే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రక టన రానుంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను కైవసం చేసు కుంది. 2025 సీజన్‌లో మ్యాచ్‌లకు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై ఆతిథ్యమి చ్చాయి. ఫిబ్రవరిలో పురుషుల టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఒక నెల ముందుగానే డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించబోతున్నారు.