calender_icon.png 18 August, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ అభినందన

10-12-2024 11:34:57 PM

న్యూఢిల్లీ: కౌలలంపూర్ వేదికగా జరిగిన 10వ ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్‌లో చారిత్రక ప్రదర్శనతో మెరిసిన అథ్లెట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. 55 పతకాలు సాధించడం ద్వారా దేశానికి మరింత ఖ్యాతిని తీసుకొచ్చారు. మీరు సాధించిన విజయం దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని మోదీ పేర్కొన్నారు. కాగా మొత్తం 68 మంది అథ్లెట్ల బృందం టోర్నీలో పాల్గొనగా.. భారత్ 55 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 18 రజతాలు, 29 కాంస్యాలున్నాయి. టోర్నీని 21వ స్థానంతో ముగించింది. 2015 తైవాన్‌లో జరిగిన తొలి ఆసియా పసిఫిక్ డెఫ్ గేమ్స్‌లో భారత్ కేవలం ఐదు పతకాలు మాత్రమే గెలుచుకుంది.