calender_icon.png 22 November, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్గిల్ యుద్ధ వీరులకు ప్రధాని నివాళులు

26-07-2024 10:12:17 AM

న్యూఢిల్లీ: లద్దాఖ్ ద్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మరణించిన సైనికులకు నివాళులర్పించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనిక బలగాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సత్కరించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ మంత్రి నివాళులర్పించారు.  కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద  సీడీఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వితేది, కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద త్రివిధ దళాలు నివాళులర్పించాయి. కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా పలువురు నేతలు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు.