27-01-2026 12:00:00 AM
పీఎంశ్రీ నిధుల్లో ఎస్సీ కంపోనెంట్ 17%, ఎస్టీ కంపోనెంట్ 11%, జనరల్ కంపోనెంట్ 72% చొప్పున లెక్కించి, ఆ దామాషాలోనే ఖర్చు చేసి బిల్లులు సమర్పించాలని నిబంధన విధించారు. నిర్దేశించిన పర్సెంటేజ్ ప్రకారం నిధులు ఖర్చు చేయడం అన్ని సందర్భాల్లో, అన్ని పాఠశాలల్లో సాధ్యం కావడం లేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఆడిట్ అభ్యంతరాలు వస్తాయనే భయంతో హెచ్‌ఎంలు నిధులు ఖర్చు చేసేందుకు జంకుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి, విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి గావించాలనే సంకల్పంతో కేం ద్ర ప్రభుత్వం 2023లో ప్రతిష్ఠాత్మకంగా ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదేళ్ల పాటు కొనసాగే ఈ పథకంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు మంజూరు చేస్తాయి. రాష్ట్రంలో 794 పాఠశాలలను ఎంపిక చేసి, ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగా రూ.౩.౫ లక్షల నుంచి రూ.౧౦ లక్షల వరకు ఏటా గ్రాంట్స్ మంజూరవుతున్నా యి.
విద్యార్థుల ఎక్స్పోజర్ విజిట్స్, ఒకేషనల్ రా మెటీరియల్, ఇండస్ట్రీయల్ విజి ట్స్, గరల్స్ చైల్ ఎంపవర్‌మెంట్, శానిటరీ నాప్కిన్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ మీట్, యోగా, కరాటే క్లాసులు, గెస్ట్ లెక్చరర్స్, బతుకమ్మ పండుగ నిర్వహణ వంటి వాటికి ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. గ్రాంట్స్ భారీగా మంజూరు అవుతున్నా వాటి వినియోగంపై విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కఠిన నిబంధనల కారణంగా గ్రాంట్స్ ఖర్చు చేయడం, డబ్బులు చెల్లించడం పెద్ద సమస్యగా మారింది.
ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు నిధు లు ఖర్చు చేయాలని పేర్కొంటూ పదేపదే హుకుం జారీ చేస్తుండడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది పీఎంశ్రీ పథకం క్రింద రాష్ట్రంలోని పాఠశాలలకు రూ.60.15 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, గత నెల 22 వరకు కేవలం రూ.2.54 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీన్ని మంజూరైన మొత్తం నిధుల్లో ఇప్పటివరకు కేవలం 10% లోపే ఖర్చయినట్లు లెక్క.
ఖర్చు చేశాకే గ్రాంట్ల విడుదల
పీఎంశ్రీ పథకం ద్వారా ముందుగా వస్తువుల కొనుగోలు లేదా అవసరమైన వాటికి నిధులు వెచ్చించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో బిల్స్ సబ్మిట్ చేస్తే పది, ౧౫ రో జుల్లో సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నే రుగా ఆన్‌లైన్ సిస్టంలో పేమెంట్ చేస్తున్నా రు. ఈ విధానం ప్రధానోపాధ్యాయుల కు పెద్ద తలనొప్పిగా మారింది. పేమెంట్స్ చేయకుండా వందలాది మంది విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్స్‌కు తీసుకొని వెళ్లడం, నగ దు చెల్లింపులు లేకుండా రూ.వేలు వెచ్చిం చి వస్తువులు కొనుగోలు చేయాలనే నిబంధన ప్రధానోపాధ్యాయులకు గుదిబండగా మారింది.
డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీవో) హోదా ఉన్న హైస్కూల్ హెచ్‌ఎంలు తాము పెట్టిన ఖర్చులకు సం బంధించిన బిల్లులను నేరుగా ‘స్పర్శ్’ ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పిస్తున్నారు. డీడీవో హోదా లేని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, మో డల్ స్కూల్స్ మరియు సొసైటీ స్కూల్స్ ప రిస్థితి మరీ ఘోరం. ఈ పాఠశాలల హెచ్‌ఎంలు మొదట తాము వెచ్చించిన ఖర్చుల మేరకు బిల్లులు తీసుకొని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ వారే ఆన్‌లైన్‌లో బిల్స్ సబ్మిట్ చేస్తున్నారు. డీఈవో ఆఫీసుల్లో ఈ ప్రక్రియ సత్వరం పూర్తి చేయకపోవడంతో బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోం ది. ఫలితంగా వస్తుసేవలు అందించిన వారు తమ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ హెచ్‌ఎంలను నిలదీస్తున్నారు.
ఒత్తిడికి గురవుతున్న హెచ్‌ఎంలు
ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీ వారీగా నిధులు వెచ్చించి దాని ప్రకారమే బిల్లులు సమర్పించాలనే నిబంధన వల్ల సమస్యలు మరింతగా పెరిగాయి. మొత్తం నిధుల్లో ఎస్సీ కంపోనెంట్ 17%, ఎస్టీ కంపోనెంట్ 11%, జనరల్ కంపోనెంట్ 72% చొప్పున లెక్కించి, ఆ దామాషాలోనే ఖర్చు చేసి బిల్లులు సమర్పించాలని నిబంధన విధించారు. నిర్దేశించిన పర్సెంటేజ్ ప్రకారం నిధులు ఖర్చు చేయడం అన్ని సందర్భాల్లో, అన్ని పాఠశాలల్లో సాధ్యం కావడం లేదు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఆడిట్ అభ్యంతరాలు వస్తాయనే భయం తో ప్రధానోపాధ్యాయులు నిధులు ఖర్చు చేయడానికే జంకుతున్నారు. హెచ్‌ఎంలు పాఠశాలలో రోజువారీ బోధన, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే, పీఎంశ్రీ కార్యక్రమాలకు సంబంధించిన ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, బిల్స్ సబ్మిషన్, యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సిద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో హెచ్‌ఎంలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
నిబంధనలను సవరించాలి
ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం తక్షణమే కొన్ని ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న మొత్తాల పనులకు సరళమైన చెల్లింపు విధానం ప్రవేశపెట్టాలి. పేమెంట్ లేకుండా విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకొని వెళ్లడానికి ప్రైవేట్ ట్రావెలర్స్ నిరాకరిస్తున్నందున ప్రభుత్వమే ఆర్టీసీకి ఉత్తర్వులు జారీ చేసి బస్సులను ఏర్పాటు చేయాలి.
ఈ చర్యతో ఆర్టీసీకి కూడా ఆర్థికంగా ప్రయోజనమే. అదే విధంగా డీడీవో హోదా లేని దాదాపు 200 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైతం ‘స్పర్శ్’ పోర్టల్లో బిల్స్ సమర్పించేలా నిబంధనలు సవరించాలి. యోగా, కరాటే మాస్టర్లను ప్రభుత్వమే నియమించి రెమ్యూనరేషన్ నేరుగా చెల్లించాలి. శానిటరీ నాప్కిన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్స్‌ను కేంద్రీకృత కొనుగోలు విధానంలో ఏకమొత్తంగా ప్రభుత్వమే సేకరించి పాఠశాల లకు సరఫరా చేయాలి.
ఈ పద్ధతి ద్వారా ధర కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. పీఎంశ్రీ వంటి గొప్ప పథకం విజయవంతం కావాలంటే క్షేత్ర స్థాయిలో అమలుకు సాధ్యమైన నిబంధనలు మాత్ర మే ఉండాలి. ప్రధానోపాధ్యాయులను అనుమానంతో కాకుండా, భాగస్వాములుగా భావించి విధానాలు రూపొందిం చినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. లేనిపక్షంలో రూ.కోట్ల నిధులు పాఠశాలల ఖాతాల్లోనే మురిగిపోతాయి. నిబంధనల్లో మార్పు రానిపక్షంలో 31 మార్చి, 2026 తర్వాత నిధులు వాపస్ పోయే ప్రమాదం ఉంది.
-మానేటి ప్రతాపరెడ్డి (వ్యాసకర్త టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు సెల్: 98484 81028)