calender_icon.png 14 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరిక నిర్మూలన కోసం పీఎంసీ కృషి

14-09-2025 12:38:13 AM

  1. పీఎంసీ జాతీయ కన్వీనర్ సత్యంబాబు బోస్
  2. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణలో పీఎంసి కృషి అభినందనీయం
  3. సమాచార హక్కు కమిషనర్ భూపాల్

ముషీరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): గ్రామీణ పేద ప్రజల శ్రేయస్సు, సాధికారత కోసం ప్రజా పర్యవేక్షణ కమిటీ నిరంతరం  కృషి చేస్తుందని పీఎంసి జాతీ య కన్వీనర్ సత్యంబాబు బోస్ అన్నారు. ప్రజా పర్యవేక్షణ కమిటీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి అయిన సందర్బంగా జాతీయ సమ్మేళనం సమావేశం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో శనివారం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సమాచార హక్కు కమీషనర్ డి. భూపాల్, సత్యబాబు బోస్ లు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం ఇందిరా జల ప్రభ పథకం ద్వారా ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో తమ పీఎంసి ప్రయాణం  ప్రారంభం అయిందని అన్నా రు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఉపాది హామీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, జెండర్ బడ్జెట్, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ఎక్కడ రాజీ పడకుండా పనిచే యడం  అభినందనీయమనిఅన్నారు.

ఈ కార్యక్రమానికి పీఎంసి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహిం చగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట రాములు, ఉపాధ్యక్షుడు బి. ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ లతో పాటు పలువురు నాయకులు ప్రసంగించారు.

అనంతరం ఆంద్రప్రదేశ్ నూతన కన్వీనర్‌గా సాల్మన్ పాల్, కో-కన్వీనర్‌గా మధుసూదన్ లను ఎన్నుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కన్వీనర్లు  సాల్మన్ పాల్, శ్రీనివాసులు, రాష్ట్ర కన్వీనర్ ఎస్. శివలింగం, కంచుకట్ల సుభాష్, మధుసూదన్, తిరుమలేశ్, రమేష్, నర్సిం హ, వెంకటేష్, కృపావేణి, సోమశేఖర్, శ్రీనివాసులు, పెంచల నర్సయ్య, యోబు, రాముడు తదితరులు పాల్గొన్నారు.