calender_icon.png 14 September, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిన్సిపాల్ వేధింపుల నుంచి రక్షించండి

14-09-2025 12:36:39 AM

తెలుగు లెక్చరర్ సంజీవరెడ్డి

ఖైరతాబాద్ : సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి) : హాలియా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వేధింపుల నుంచి రక్షించాలని తెలుగు లెక్చరర్ సంజీవరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు, రిటైర్డ్ హిందీ పండిట్ హరిహర నాథ్ గుప్తా  తదితరులతో కలిసి మాట్లాడారు.. 1992 సంవత్సరంలో  జూనియర్ కాలేజీలో పార్ట్ టైం తెలుగు జూనియ ర్ లెక్చరర్‌గా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగిందన్నారు.

తదనంతరం 1998లో ఎస్జిటి ఉద్యోగం వచ్చిందని తెలిపారు. ఇలా పని చేస్తూ 2018 జూలై నెలలో హాలియా ప్రభు త్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగిందని తెలిపారు. అదే కాలేజీకి 2021 సంవ త్సరంలో విజయ్ నాయక్ అనే వ్యక్తి ప్రమోషన్‌పై  రావడం జరిగిందన్నారు. వచ్చిన అనంతరం ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అతని అధికార దుర్వినియోగంపై 2023 అక్టోబర్ 25న సంబంధిత శాఖ  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

అధికారులు స్పందించకపోవడంతో 2024 జనవరి 3న రెండవసారి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో విజయ నాయ క్ తన పైనా కక్ష కట్టి కుల పరంగా వేధిస్తున్నానంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే తనను వికారాబాద్ కు బదిలీ చేయడం జరిగిందని అన్నారు.

ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్‌ను డిస్మిస్ చేస్తూ విచారణ జరిగే వరకు హాలియా లొనే కొనసాగించవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలిపా రు. ఈ ఉత్తర్వులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు ఐదున్నర నెలల కాలయాపన చేసి చివరికి ఆగస్టు 5న పోస్టింగ్ ఇచ్చామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ నాయక్ తన ఒక్కడినే కాకుండా కిందిస్థాయి  ఉద్యోగుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తాడని కావున అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.