calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాన

26-09-2025 12:14:34 AM

  1. పిడుగు పాటుకు మాడిపోయిన పత్తి 
  2. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం
  3. రామగుండంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఆదిలాబాద్/నిర్మల్/పెద్దపల్లి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి)/మహదేవపూర్: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గురువారం ఎడతెరపి లేని వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున నుచి ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లాలోని ఇచ్చోడలో 14 సెం.మీ.లు, ఉట్నూర్ లో 11.3, బేల మం డలం చెప్రాలలో 10 సెం.మీ.ల వర్షపాతం నమోదు అయ్యింది.

ఇచ్చోడ మండలం ముఖరా (బి) గ్రామ శివారులో పత్తి చేనులో పిడుగు పడటంతో సుమారు 200కు పైగా పత్తి మెక్కలు మాడిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, అక్కడి ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న నీటితో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో గోదావరిలోకి సుమారు మూడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. 

బాసర వద్ద ఉగ్రరూపం దాల్చడంతో పుష్కర ఘాట్ల వద్దకు రాకపోకలు నిషేధించారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ బాస రను చేరుకోవడంతో బాసర మండలంలోని ఓని కౌటసాలాపూర్ ఇతర గ్రామాలు 15 రోజులుగా పంటలు మునిగిపోవడంతో రైతు లు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉండ గా జిల్లావ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుం డా వర్షాలు కురవడంతో నూతన ప్రాంతాలు జలమయమయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మం డలంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొం గి ప్రవహిస్తున్నది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ వద్ద 7,40,400 క్యూసెక్కుల నీటి ప్రవాహం  రాగా మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

కాళేశ్వరం వద్ద మెట్ల పై నుండి గోదావరి ప్రవహిస్తున్నందున భక్తులు మెట్ల వద్దనే స్నానాలు ఆచరించాలని లోపలికి వెళ్లరాదని అధికారులు సూచించారు. అన్నారం బ్యారేజ్ దిగివన  మద్దుల పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, మిర్చి చేన్లు గోదావరి నీటితో నిండిపోయాయి. 

బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రామగుండం రీజీయన్‌లోని సింగరేణి ఉపరితల గనులకు వాన గండం ఎదురైంది. బుధవా రం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భారీగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జిల్లాలోని రామగుండం రీజీయన్ పరిధిలోని ఓసీపీ- 1,2,3,5 ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గురువారం మొదటి షిప్టు నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది.

ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి చేసే భారీ యంత్రాలు ఎక్కడికక్కడే పని స్థలాల్లోనే నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం తో ఓసీపీల క్వారీల్లోకి వరదనీరు చేరడంతో ఉదయం నుంచి ఉత్పత్తికి ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. రామగుండం రీజీయన్‌లో ఒక్కరోజే దాదాపు 40 వేల టన్నుల బొగ్గు ఉత్ప త్తికి నష్టం కలిగినట్లు తెలుస్తోంది. కాగా, క్వారీల్లో చేరిన వరద నీరును ఎత్తిపారపోసేందుకు మోటార్లు బిగించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.