నేటి నుంచి పోలీస్ క్రికెట్ లీగ్ టోర్నీ: సీఐ
14-03-2025 | 12:00am
మేడ్చల్, మార్చి 13 (విజ యక్రాంతి): మే డ్చల్ పోలీస్ క్రికె ట్ లీగ్ టోర్నీ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగుతుందని సిఐ సత్యనారాయణ తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా టోర్నీ నిర్వహిస్తున్నమన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 జట్లు ఇందులో పాల్గొంటున్నాయాన్నారు. కేఎల్‌ఆర్‌లోని ఎన్‌హెచ్ 7 గ్రౌండ్లో టోర్నీ జరుగుతుందన్నారు.






