calender_icon.png 16 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయనికి వచ్చే భక్తుల రక్షణకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు

16-09-2025 12:40:44 AM

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి. ఆలయంలో ఆలయ భద్రత, భక్తుల ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాలసిన భద్రత ఏర్పాట్లపై వివిధ శాఖల సమన్వయంతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... వేములవాడ ఆలయానికి వచ్చే భక్తుల భద్రతకు పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని పూర్తి చేసుకునుల ఏర్పాట్లు చేయాలని ఆలయాల అధికారులను ఆదేశించారు.ఆలయ ప్రాంగణం,గోపుర ద్వారాలు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వీధులలో సీసీ కెమెరాల ను విస్తృతంగా అమర్చాలన్నారు.భక్తులు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ నిత్యం పర్యవేక్షణ చేయాలని.సూచించారు.

ఆలయానికి వచ్చే భక్తులకు ఇ బ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రధాన రహదారుల్లో డైవర్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని.సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది నియమించి, వాహనాలను క్రమబద్ధంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈ సమావేశంలో వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రి రెడ్డి , రాజన్న సిరిసిల్ల జిల్లా అదునపు ఎస్పీ చంద్రయ్య , ఆలయ ఈవో ఎల్ రమాదేవి, ఆలయ ఉద్యోగులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.