14-10-2025 06:31:18 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమమును మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పెద్దపల్లి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ హెపటైటిస్ బి వ్యాధి ముఖ్యంగా రక్తం, శరీర ద్రవాల వ్యాప్తి చెందుతుంది, అందువలన హెపటైటిస్ బి సోకిన వ్యాధికి సేవలు అందించే క్రమంలో ఈ వ్యాధి వైద్య సిబ్బందికి సోకే అవకాశం ఉంది అని అన్నారు. అందుకు వైద్య సిబ్బంది రక్షణ కొరకు ఈ వ్యాధి నిరోదక కార్యక్రమం చెప్పట్టడం జరిగిందన్నారు. జీరో డోస్ తీసుకున్నాక నెలకు ఒక డోస్, 6 నెలల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి. కిరణ్ కుమార్, స్థానిక వైద్యుడు డా.ఉదయ్, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.