calender_icon.png 19 August, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి పోలీస్ ప్రజావాణి

19-08-2025 01:34:29 AM

నిర్మల్, ఆగస్టు ౧౮ (విజయక్రాంతి): ప్రజలకు ఏ సమస్య ఏర్పడ్డ పోలీస్ శాఖకు సంప్రదిస్తే దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు ఎస్పీ జానక షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో పోలీసు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జులను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

నిర్మల్ జిల్లాలో వినాయక చవితి పండుగలు నేపథ్యంలో డీజేల విషయంలో ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటి స్తూ శబ్దాలను నియంత్రించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పండుగలు ఉత్సవాల్లో పరిమితికి మించి డీజిల్ వాడితే వారిపై చర్యలు తీసుకుంటామని సామాగ్రిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. డీజేలు ఉపయోగించేవారు ముందుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ రాకేష్ మీనా అవినాష్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.