19-08-2025 01:35:36 AM
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాం తి): మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో గల ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ ఫౌజ్‌ను స్థాపించిన విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి, తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాలను నిర్వహించారు.
వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మా ట్లాడుతూ.. సాయిధ పోరాటాలతోనే స్వా తంత్య్రం సాధ్యమని నమ్మి హిందూ ఫోజ్ ను స్థాపించిన విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి.. మీకు నేను స్వాతంత్య్రాన్ని ఇస్తాను అని యువతరాన్ని ఉత్తేజి తులను చేసిన చైతన్య వీరుడు నేతాజీ అని కొనియాడారు.
ఆయన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మొగలాయి అరాచకాలను, దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారం కోసం 400 సంవత్సరాల క్రితమే పోరాడిన ధీరుడు అని పేర్కొన్నారు.