12-09-2025 12:38:11 AM
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘చాయ్‌వాలా’. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా తేజు అశ్విని నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా గురువారం మేకర్స్ ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’
అనే ఈ మెలోడీ సాంగ్‌ను ప్రశాంత్ ఆర్ విహారి స్వరపర్చగా సురేశ్ బనిశెట్టి సాహిత్యం అందించారు. కపిల్ కపిలన్ పాడారు. ‘సఖిరే నువ్వుంటే చాలులే.. సఖిరే నీవెంటే నేనులే.. ఉరికే ఉరికే నీవెనకాలే వస్తానంటూ, మనసాగనంటూ ఉరికే.. దొరికే దొరికే ఏ కలలోనైనా ఏనాడైనా అనుకోని హాయి దొరికే..
చాటుగ నిన్నే చూస్తూ మురిశా మురిశా.. అలవాటుగా నీ ఊహల్లో తడిశా తడిశా.. పింగాణీ బొమ్మల్లే ముద్దొస్తూ ఉన్నావే.. ప్రతి పూట ప్రేమించే పనిలోనే పడిపోయా..’ అంటూ సాగుతోందీ పాట. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ నర్వ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.