calender_icon.png 12 September, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీతో తలపడే ఓమి

12-09-2025 12:39:38 AM

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తు న్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాలో ‘ఓజాస్ గంభీర’గా పవన్‌కళ్యాణ్.. ‘ఓమి’గా ఇమ్రాన్ హష్మీ మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది.

అయితే, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం నుంచి మేకర్స్ ‘ఓమి’ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రబృందం ‘ఓమి ట్రాన్స్’ పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది విలన్ క్యారెక్టర్ ప్రధానంగా సాగే పవర్‌ఫుల్ సాంగ్ ఇది.

ఈ గీతానికి అద్వితీయ సాహిత్యం అందిస్తూ శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతికతో కలిసి ఆలపించారు. ‘ఓజీ’, ‘ఓమి’ల ముఖాముఖి పోరును సూచించేలా ఉందీ గీతం. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; ఛాయాగ్రహణం: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి.