calender_icon.png 9 October, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీయస్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మ దహనం

09-10-2025 12:00:00 AM

చౌటుప్పల్ , అక్టోబర్ 8(విజయ క్రాంతి): చౌటుప్పల్ పట్టణం లో ఎమ్మార్పియస్ ఆధ్వర్యంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మీడియా సమావేశ కార్యక్రమంలో కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపి దిష్టిబొమ్మ దహనం.

ఈ సందర్భంగా ఎమ్మార్పియస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ను అవమానించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగలు అందరు ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు తీవ్రంగా ఉద్యమాన్ని మలచి ఆందోళనలు చెపట్టి పొన్నం ప్రభాకర్ కు మాదిగ ల ఉద్యమ రుచి చూపిస్తామని మంత్రి పదవి భర్తరాఫ్ చేసేదాకా పోరాటం చేస్తామని అన్నారు.

సాటి దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి పై పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేస్తే పొన్నం ప్రభాకర్ పక్కనే కూర్చున్న దళిత వర్గానికి చెందిన మంత్రి వివేక్ పొన్నం వ్యాఖ్యలు ఖండించక పోవడం విడ్డూరమని దళిత మంత్రి గా మిమ్మల్ని చూసి దళితులు నివ్వేర పోతున్నారని అన్నారు.  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఈగ వాలిన దళిత జాతీ మాదిగలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మార్పియస్ సీనియర్ నాయకులు తూర్పింటి యాదయ్య, ఎమ్మార్పీఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్, మాదిగ జర్నలిస్టు ఫోరం మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర గౌతమ్, ఎర్ర అర్జున్, ఎర్ర విగ్నేష్ , బోయ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.