calender_icon.png 28 September, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లతో రాజకీయాలా?

21-09-2025 12:00:00 AM

పాలూరు రామకృష్ణయ్య :

తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ ప్ర భుత్వం 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లతో రాజకీయ ప్రక్రియను ప్రా రంభించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాలల్లోనూ ఇవే రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. అయితే ఇవ న్నీ జరగాలంటే పార్టీ అధికారంలోకి రావా ల్సి ఉంటుంది.

అప్పుడే బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు సాధ్యమని రేవంత్ పేర్కొన్నారు. మరి ఈ ప్రకటన రేవంత్ రెడ్డి ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని పూర్వాపరాలు ఏమిటన్న విషయాలు మనందరం తెలుసుకోవాల్సిన అవసరముంది. రాహు ల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వర కు పాదయాత్ర చేసిన తరుణంలో అనేక వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఆ సంప్రదింపుల్లోనే రాహుల్ గాంధీకి దేశంలో వెనుకబడిన తరగతులు (బీసీలు) జనాభా సగటు 52 శాతం ఉంద న్న విషయం స్పష్టమయింది.

ఇది దృష్టిలో పెట్టుకొనే బీజేపీ కూడా వ్యూహాత్మకంగా 2013, సెప్టెంబర్ 3న నరేంద్ర మోదీని ప్ర ధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. వెనుకబడిన తరగతుల్లో మోదీ అంతటి సమర్థ వంతమైన నాయకులు బీజేపీలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందువల్లే గుజరాత్‌లో మూడుసార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సరైనవాడని పార్టీ గుర్తించింది.

అంతేకాదు ప్రధానమంత్రి అభ్యర్థిగా వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తిని ప్రకటిస్తే దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలందరూ తమ పార్టీకే ఓటు వేస్తారని భావించిన బీజేపీ వ్యూహాత్మక విధానాన్ని అనుసరించింది.  దీనికి తోడు మోదీ ‘చాయ్ వాలా’ అని కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరైన మణిశంకర్ అయ్యరు ప్రకటించారు. మోదీ ఓడిపోవ డం ఖాయమని.. ఆయన ఓటమి తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో ఒక టీ స్టాల్ పెట్టిస్తామని ఎద్దేవా చేశారు. 

చేతులు మారిన అధికారం

కాంగ్రెస్ అగ్ర నాయకుడు గులాంనబీ ఆజాద్ మోదీ తేలి కులాన్ని ఉటకించుతూ ‘కహ గంగూ తేలీ, కహా రాజాబోజ్’ అని ఎగతాళి చేశారు. అప్పటి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఒక సభలో మాట్లాడుతూ ‘యే నీచ్ జాతీ కా లోగ్ హైసయి బాత్‌కరేగా’ అని బీసీలను ఉద్దేశించి అవమానకంగా మాట్లాడటం ప్రజ లు తట్టుకోలేకపోయారు. ఒక జాతిని కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని బీసీలకు ఆగ్రహం తెప్పించింది.

దేశంలో 12 కోట్ల తేలీ, సాహు, గాండ్ల, గానుగర, వీనికవైశ్య మొదలైన బీసీ కులాలంతా ఏకమై అప్పటి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా ప్రధాని రేసులో ఉన్న మోదీని గెలిపించుకున్నారు. మోదీ ప్రధాని అయి తే బలహీన వర్గాలైన బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించారు. దాని పర్యావసానం ఎంతలా ఉందంటే 2014 సాధా రణ ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేయడానికి కారణమైంది.

ఆ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు సాధించి అధికా రాన్ని హస్తగతం చేసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేద, బడు గు వర్గాలైన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కేంద్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ రంగా ల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. బీసీలను ఉప వర్గాలుగా విభజించేందుకు 2017లో జస్టిస్ రోహిణి కమిషన్‌ను కూ డా ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత 2018లో చాలా కాల నుంచి బీసీలు కోరుకుంటున్న జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. అధికారంలోకి వచ్చిన మొదటి దఫాలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం పలు రకాల చర్యలు చేపట్టడంతో 2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీపై బీసీలు అమితమైన ప్రేమను పెంచుకున్నారు.

మళ్లీ తిరిగి మోదీ నాయకత్వం ఏర్పడితే బీసీల అభివృద్ధికి మరింత దోహదం కలుగుతుందని భావించి ఆనాటి జనరల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టి 303 సీట్లతో గెలిపించడం విశేషం. దీంతో బీజేపీ ఎవరి అండ లేకుండానే సొంతంగా అధికారం ఏర్పాటు చేయగలిగింది. ఇదంతా బీసీల చలువ వల్లే అన్న విషయం మరువద్దు.

బీజేపీలో ముసలం

2019లో అధికారంలోకి వచ్చిన వెంట నే ప్రధాని మోదీ బీసీల కులగణన చేయాలని భావించారు. అప్పటికే పార్టీలో ముస లం పుట్టింది. అగ్రవర్ణాల నాయకుల ఒత్తిడితో మోదీ కులగణన అంశానికి స్వస్తి పలకాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి కేం ద్ర హోంశాఖలో సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కులగణనను విరమించుకున్నామని రాజ్యసభలో, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లోట్ లోక్‌సభలో ప్రకటించారు.

దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలంటూ సుప్రీంకోర్టులో డబ్ల్యూపీ నెం. 259/ 1994, 356/1994 రిట్ పిటీషన్లలో ప్రభుత్వాలు కులగణన చేసిన అధికారిక గణాం కాలు ఉంటే రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి చేయాల్సిన అవసరం ఉండదు. ఆ 50 శాతం పరిమితిని పెంచి రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో బీజేపీ కులగణన చేయలేమని పార్లమెంట్‌లో ప్రకటించింది.

ఇది దేశంలోని వెనుక బడిన తరగతుల నాయకులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఫలితంగా 2024 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యా బలం 303 సీట్ల నుంచి 240కి పడిపోయింది. ఇలా జరుగుతుందని బీజేపీ బహుశా ఊహించకపోయి ఉండొ చ్చు. 2024 ఎన్నికల తర్వాత మిత్రపక్షాల సాయంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కులగణన విషయంలో మాట మార్చింది.

అగ్ర వర్ణాల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ 2021లోనే కులగణన చేయాలని నిర్ణ యించామని, కానీ కరోనా వల్ల అది సాధ్యపడలేదని పేర్కొంది. ఈసారి ఎన్డీయే కూ టమితో కలిసి అధికారం నిలబెట్టుకున్న బీజేపీ తాజాగా కులగణన చేస్తామని ప్రకటించడం గమనార్హం.

తెలంగాణలో పరిస్థితి!

బీసీల విషయంలో కేంద్రం అనుసరించిన విధానాన్ని గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ను రూపొందించారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ శాసనస భలో, శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.

ఆ తర్వాత బీసీ బిలు ను రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపించగా, ఆయన రాష్ట్రప తికి పంపించారు. తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకు బిల్లులు రాష్ట్రపతి ఆమోదముద్రకు నోచుకోలేదు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలతో 42 శాతంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఒక ఆర్డినెన్సును తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం దానికి సంబంధించిన బిల్లులను శాసనసభలో ఆమోదించుకో వడంలో విజయవంతమైంది.

ఆ తర్వాత వాటిని రాష్ట్రపతి, గవర్నర్‌కు ప ంపించారు. ఇక రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని ఆదేశించింది. ఆర్డినెన్స్‌తో శాసన సభలో ఆమోదం పొందిన బీసీలకు సం బంధించిన బిల్లులు గవర్నర్ వద్దకు ప ంపగా ఆయన కూడా ఆమోద ముద్ర వే శారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకొస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. 

కానీ గవర్నర్ ఆ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ర్ట ప్ర భుత్వాన్ని ఆదేశించడంతో బిల్లుకు సంబంధించిన సంబంధిత జీవో బయటికి రాకుండా ప్ర భుత్వం ఆపాల్సి వచ్చింది. వాస్తవంగా రా జ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో 42 శా తం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికా రం శాసనసభ, శాసనమండలికి ఉం టు ంది.

రేవంత్ ఈ విషయం తెలిసి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు ఇస్తే ఇది గిట్టని వాళ్లు కో ర్టు మెట్లు ఎక్కితే మొదటికే మోసం వస్తుందేమోనని భయపడి బీసీ బిల్లుల వి షయంలో కాలాయాపన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్లతో రాజకీయం చేయడం మానుకోవాలనేది పలువురి అభిప్రాయం.