10-02-2026 01:03:34 AM
అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎన్ని కల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్‌తో కలిసి ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకమని, కౌంటింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉం డాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉం టే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని తెలిపా రు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ప్రతి దశను వీడియోగ్రాఫీ చేస్తూ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన పక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డుల కౌంటింగ్ కోసం 49 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో వార్డులో సుమారు 3000కు పైగా ఓట్లు ఉండే అవకాశం ఉన్నందున, మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్ సిబ్బంది ఫిబ్రవరి 12న జరిగే రెండో విడత శిక్షణకు, అలాగే 13న జరిగే కౌంటింగ్ రోజున నిర్ణీత సమయానికి హాజరు కావాలని, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, శిక్షకులు, సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.