9 April, 2026 | 1:01 PM

మేయర్ విజయలక్ష్మికి సన్మానం

10-02-2026 01:05 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పదవికాలం ముగింపు సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని జై గణేశ భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కె.ఎస్ ఆనంద్‌రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ అన్నెం కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు, జై గణేశ భక్తి సమితి, ఎన్ శ్రవణ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆమెను కలసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గద్వాల్ విజయలక్ష్మి  సేవలు ప్రశంసనీయమన్నారు.