calender_icon.png 9 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తి

09-12-2025 01:41:47 AM

కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, డిసెంబర్ 8 (విజయక్రాంతి)  :  2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి మూడవ విడత పోలింగ్ సిబ్బందికి రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.. జిల్లాలోని ఇటిక్యాల,ఎర్రవల్లి, అలంపూర్, మనోపాడు, ఉండవెల్లి (5) మండలాల్లో నిర్వహించనున్న రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

వీటిలో విధులు నిర్వర్తించడానికి  పీఓలు 700,ఓపీఓలు 859 సిబ్బంది మొత్తం 1,559 మందిని రెండవ ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీకాంత్, ఈడియం శివ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.