calender_icon.png 9 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి పట్టణంలో భారీ చోరీ

09-12-2025 01:40:35 AM

40 తులాల బంగారు ఆరు లక్షల నగదు అపహరణ 

కల్వకుర్తి, డిసెంబర్ 8: కల్వకుర్తి పట్టణంలో విద్యానగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి  భారీగా బంగారు నగదు అపహరించిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..  విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పూజారి శ్రీనివాస శర్మ వారం రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి వేరే గ్రామానికి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరగొట్టి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి .

దీంతో ఇంట్లో దాచి ఉంచిన 40 తులాల బంగారు, రూ, 6 లక్షలు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి బాధితుడు నుండి ఫిర్యాదు స్వీకరించారు. పట్టణంలో  కొంతకాలంగా చోరీలు జరుగుతుండడం, దొంగలు పట్టు పడకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రి పగలు కసి పెంచాలని వేడుకుంటున్నారు.