19-12-2025 12:16:52 AM
నకిరేకల్, డిసెంబర్ 18 : కట్టంగూరు మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో ఈ నెల 11న నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో సీపీఎం అభ్యర్థులుగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తొమ్మిదో వార్డు మెంబర్గా పొన్న శిరీష సురేష్, మూడో వార్డు మెంబర్గా దెందె సురేష్ ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఎన్నికల్లో పోటీ చేశామని వారు తెలిపారు.
అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ నెల 22న పొన్న శిరీష సురేష్ ఉపసర్పంచ్గా, దెందె సురేష్ మూడో వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గతంలో విద్యార్థి ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమాల్లో పని చేసిన అనుభవం తమకు ఉందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు.