24-09-2025 12:00:00 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 23,(విజయక్రాం తి):టేకులపల్లి మండలం రాంపురం గ్రామ పంచాయతీలోని పాతతండా అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టేకులపల్లి ఐసి డీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కే ఎం తార హాజరయ్యారు. తల్లులకు చిరుధావులు ఉపయో గించి అనుబంధ ఆహార వంటకాలు తయారుచేసే ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. 6 నెలల చిన్నారులకు అన్న ప్రసన్న వే డుక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ బి నిర్మల, అంగన్వాడి టీచర్ అంతోటి లీలాబాయి, బర్మావత్ మం గ, రావులమ్మ, కౌసల్య, అనసూర్య, శ్రావణి, సావిత్రి, దేవి, శ్రీదేవి, బాజీ భాయ్, తదితరులు పాల్గొన్నారు.