22-12-2025 01:10:45 AM
అధికారుల నిర్లక్ష్యానికి
నిలువెత్తు సాక్షాలు
హనుమకొండ, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): ముంథా తుఫాను వల్ల ఏర్పడిన గుంతలు, లోయలు రెండు నెలలు గడిచిన అధికారులకు కానరాకపోవడం శోచనీయం. హనుమకొండ నగరంలోని కాకతీయ యూ నివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు వెళ్లే 100 ఫీట్ల ప్రధాన రహదారిని ఆనుకొని ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చడం మర్చిపోయారు. మొంథా తుపానుకు గోపాల్పూర్ చెరువు తెగి ఆ వరద ఉద్ధృతికి రహదారితోపాటు పెద్ద మోరీ మూడుచోట్ల గండి పడింది. రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ మరమ్మతులు చేపట్టలేదు.
సమ్మయ్య నగర్ దాటాక ఎస్పీ ఆర్ పాఠశాల సమీపం, అమరావతి నగర్ మార్గంలో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రయాణికులు ఏమాత్రం ఆదమరిచినా ప్రా ణాలకు ముప్పు తప్పదు. సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో దారంతా అంధకారంగా ఉం టుంది. నిత్యం వాహనాల రాకపోకలతో దుమ్ముతో వాహనదారులు ఇబ్బందులు ప డుతున్నారు. ఇప్పటికైనా నగర పాలక శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు విన్నవిస్తున్నారు.